ఇది నల్ల జిలకర . దీనిని కొంతమంది ఉల్లి గింజలు అని పొరపాటు పడతారు . కానీ నల్ల జిలకర వేరు.. ఆనియన్ సీడ్స్ వేరు. నల్ల జీలకర్రను శాస్త్రీయంగా బ్లాక్ cummin అంటారు. సంస్కృతము లో కృష్ణ జీరా , హిందీలో కాలా జీరా, కలోంజీ అనే పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం నల్ల జీలకర్రను కరోనా వైరస్ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నారు. ఇది తాగడం వల్ల వైరస్ లోడ్ తగ్గుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
జుట్టు పెరుగుదలకు కలోంజీ చాలా ఉపయోగ పడుతుంది. నల్ల జీలకర్ర మరియు ఆనియన్ సీడ్స్ తయారైన కలోంజీ ఆనియన్ సీడ్ హెయిర్ ఆయిల్ లో ఈ నల్ల జిలకర ముఖ్యమైన ఔషధం. అంతే కాదు బాగా విరోచనాలు ఉన్నప్పుడు , అజీర్తి, కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు ఒక చెంచా నల్ల జిలకర చూర్ణం తాగితే వెంటనే తగ్గుతాయి. నల్ల జిలకర చూర్ణాన్ని నూనెలో కానీ, నెయ్యిలో కానీ కలిపి రాస్తే , రసి కారే పొక్కులు తగ్గుతాయి.