తెలుగు లో తెల్ల మద్ది, మద్ది, అని పిలుస్తారు. సంస్కృతం లో అర్జున అంటారు. శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున. ఈ చెట్టు ఆకులు సుగంధభరితంగా ఉంటాయి. చెట్టు భారీ వృక్షంగా ఎదుగుతుంది. అర్జున వృక్షం దాదాపు 60 నుండి 80 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని బెరడు తెల్లగా ఉంటుంది. అందుకే దీనిని తెల్లమద్ది అంటారు. బెరడును కొస్తే , తెల్లని స్రావం వస్తుంది. అర్జున భారత దేశంలో చాలా చోట్ల పెరుగుతుంది. హిమాలయా ప్రాంతాలు, దక్కను పీఠభూమిలో దీనిని విరివిగా చూడొచ్చు. ఈ చుట్టూ బెరడు తోనే ఈ చూర్ణం తయారు చేయబడింది.. ఈ చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి కి ఒక చెంచా కొద్దిగా గోరు వెచ్చని నీళ్ళల్లో తీసుకుంటే.. గుండె పదిలంగా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం వేల ఏళ్ల నాటి నుంచే చెబుతుంది. అర్జున బెరడులో కాల్షియం, అధికంగా ఉంటుంది. అల్యూమినియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం గా కూడా పని చేస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత సడెన్ హార్ట్ ఎటాక్ తో చాల మంది చనిపోతున్నారు. అటువంటి వారు, ఈ చూర్ణాన్ని నెల రోజుల పాటు వాడితే మంచిది. ఆల్రెడీ అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందు జాగ్రత్త వాడితే మంచిది. ఇంగ్లిష్ మందులు వాడుతూనే ఈ చూర్ణాన్ని కూడా తీసుకోవచ్చు. దీని వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గుండెకు మంచి బలం. రక్త ప్రసరణకు సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. HDL ను పెంచి LDL ను తగ్గిస్తుంది.