Types of Alopecia: "Exploring the Different Types of Alopecia"
Share
- పేను కొరుకుడు అంటే ఏంటి.?
మనిషి శరీరంలోని తలతో పాటూ ఇతర శరీర భాగాలలో ఉన్నటువంటి జుట్టు రాలిపోవడాన్ని పేను కొరుకుడు సమస్య అని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీస్. ఈ పేను కొరుకుడు సమస్యని ఇంగ్లీష్ లో “అలోపీసీయా ఎరేటా” అని అంటారు. ఈ సమస్య ఎక్కువగా రోగనిరోధక వ్యవస్థ పొరపాటున హెయిర్ ఫోలికల్స్‌పై దాడి చెయ్యడం వలన కలుగుతుంటుంది. మరికొందరిలో జన్యుపరమైన అలాగే పర్యావరణ సంబందిత కారణాలవలన కూడా కలుగుతుంటుంది. అయితే పేను కొరుకుడు సమస్య వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయసు వారికి వస్తుంటుంది. కానీ ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో ఎక్కువగా ఈ పేను కొరుకుడు సమస్య అనేది 20-30 వయసు మధ్య వారిలో ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ ఆర్టికల్ లో ఈ పేను కొరుకుడు సమస్య గురించి పూర్తిగా తెలుసుకుందాం.
- అలోపీసీయా కారణాలు.
- సాధారణంగా ఈ పేను కొరుకుడు సమస్య ఆటో ఇమ్యూన్ డిసీస్ అయిన థైరాయిడ్, సోరియాసిస్ వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా బొల్లి మచ్చలు, మంగు మచ్చలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది.
- పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా ఉండటం.
- అధికంగా రోగ నిరోధక శక్తికి సంబందించిన మెడిసిన్స్ వాడటం
- కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు పొందటం.
- ఇన్ఫ్లమేషన్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ సమస్యలు కలిగి ఉండటం.
- చర్మ రుగ్మతులు, ఆస్తమా వంటి సమస్యలు కలిగి ఉండటం.
- ఇంతకుముందే తమ కుటుంబంలో ఎవరైనా ఈ అలోపీసీయా సమస్య కలిగి ఉండటం.
- జన్యుపరమైన వ్యాధులతో బాధ పడుతుండటం.
- అలోపీసీయా యొక్క లక్షణాలు:
- తరచుగా జుట్టు రాలిపోతుండటం. ఇందులో ముఖ్యంగా జుత్తు నాణెం లేదా ఆకారం లేని రూపంలో కొంత భాగంలో మాత్రమే జుట్టు రాలిపోవడం.
- కనుబొమ్మలు, శరీరంలోని ఇతర భాగాలలోని వెంట్రుకలు రాలిపోవడం.
- చేతి గోర్ల రంగులో మార్పులు కనిపించడం. మరియు పెళుసుగా, కరుకుగా మారడం
- తల మరియు వెంట్రుకలు కలిగిన భాగాలలో దురదలు, మంటగా ఉండటం.
- అనుకోకుండా జుత్తు రంగు బూడిద రంగులోకి మారడం మరియు ఊడిపోవడం.
- అలోపీసీయా ఎన్ని రకాలుగా వస్తుంది. ?
ఈ అలోపేసియా సమస్య తీవ్రతని బట్టి 4 లేదా అంతకంటే ఎక్కువ రకాలుగా విభజించారు. ఇందులో ముఖ్యంగా
- అలోపేసియా బార్బే: ఈ రకం అలోపేసియా సమస్య కలిగిన వారిలో గడ్డం మీద జుట్టు రాలిపోతుంది. కానీ ఒక్కోసారి ఇతర భాగాలలో ఉన్నటువంటి వెంట్రుకలపై ఈ ప్రభావం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
- అలోపేసియా ఒఫియాసిస్: ఈ రకం అలోపేసియా సమస్య ఉన్న వ్యక్తులలో వారి నెత్తిమీద జుట్టు కొన్ని చోట్ల మాత్రమే తరచుగా రాలిపోతుంటుంది. కానీ పూర్తీ స్థాయిలో మాత్రం వెంట్రుకలు రాలిపోవు. అలాగే ఈ ప్రభావం ఇతర భాగాలలో ఉన్నటువంటి వెంట్రుకలపై ప్రభావం చూపించదు.
- అలోపేసియా టోటాలిస్: ఈ రకం అలోపేసియా సమస్య ఉన్న వ్యక్తులలో వారి తలపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా కోల్పోతారు. అలాగే ఈ ప్రభావం స్కాల్ప్ పై పడి జుత్తు మళ్ళీ తిరిగి పొందలేని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
- అలోపేసియా యూనివర్సాలిస్: ఈ అలోపేసియా యూనివర్సాలిస్ అనేది చాలా అరుదైన పేను కొరుకుడు సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలలోని వెంట్రుకలు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా తలమీద మీద చర్మం, ముఖం (కనుబొమ్మలు) మరియు శరీరంలోని మిగిలిన భాగాలపై దాదాపుగా లేదా పూర్తిగా జుట్టు రాలడం జరుగుతుంది.
- పాచీ అలోపేసియా అరేటా: పేను కొరుకుడు సమస్య ఉన్నవారిలో ఈ పాచీ అలోపేసియా అరేటా రకం సమస్య అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఈ రకం సమస్య ఉన్నవారిలో నెత్తిమీద లేదా శరీరంలోని ఇతర భాగాలలోని జుట్టు రాలి పోతుంటుంది. ఇందులో ముఖ్యంగా తలమీద ఉన్నటువంటి వెంట్రుకలు ఒక చోట లేదా అంతకంటే ఎక్కువ చోట్లలలో నాణెం-పరిమాణంలో జుట్టు రాలిపోతుంటుంది. ఒక్కోసారి ఆకారం లేని గుర్తులలో కూడా జుత్తు రాలిపోతుంటుంది.
- అలోపేసియా ని గుర్తించడం ఎలా..?
- జుట్టు రాలిన ప్రాంతాలను మరియు గోళ్లను పరిశీలించడం. ఒకవేళ గోళ్ళు రంగు మారడం లేదా పెళుసుగా మారడం వంటివి గమనించినట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- హ్యాండ్‌హెల్డ్ మాగ్నిఫైయింగ్ పరికరాన్ని ఉపయోగించి జుట్టు మరియు హెయిర్ ఫోలికల్ స్తితిగతులను పరిశీలించడం.
- అలోపీశియా సమస్య కలిగిన వ్యక్తి యొక్క మెడికల్ హిస్టరీ మరియు కుటుంబ సభ్యుల మెడికల్ హిస్టరీని పరిశీలించడం.
స్కాల్ప్ బయాప్సీ: ఒక్కోసారి జుట్టు రాలడానికిగల నిర్దిస్తమైన కారనంతేలియకపోతే డాక్టర్లు ఈ స్కాల్ప్ బయాప్సీ టెస్టులను సూచిస్తుంటారు. ఇందులో భాగంగావైద్యులు తల మరియు చర్మం భాగాలలోని కొంత కణజాలం తీసి నమూనా పరీక్షలకు పంపిస్తారు.
రక్త నమూనా పరీక్షలు : ఈ ప్రక్రియ ద్వారా అలోపీశియా సమస్య కలిగిన వ్యక్తి బ్లడ్ సాంపిల్స్ ని తీసుకుని నమూనా పరీక్షలకు పంపిస్తారు. అయితే ఈ రక్తనమూనా పరీక్షలు అలోపెశియా సమస్య కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను తెలుపదు. కానీ ఇతర వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు పరోక్షంగా ఈ అలోపెశియా సమస్యకి కారణం అవుతున్నాయా అనే విషయాన్ని తెలియజేస్తాయి.
లైట్ మైక్రోస్కోపీ: ఈ ప్రక్రియలో వైద్యులు స్కాల్ప్ నుండి కత్తిరించిన జుట్టును నమూనా పరీక్షలకి పంపించి పరిశీలిస్తారు.
పుల్ టెస్ట్: ఈ పరీక్ష ద్వారా మీ స్కాల్ప్ యొక్క వివిధ భాగాలలోని జుట్టు రాలడాన్ని తనిఖీ చేస్తుంది. కాగా డాక్టర్లు ఈ పరీక్ష ద్వారా కొన్ని వెంట్రుకలను నిర్దిష్ట బలాన్ని ఉపయోగించి లాగుతూ పరీక్షిస్తారు. ఈ క్రమంలో 40 లేదా అంతకంటే ఎక్కువ వెంట్రుకలను లాగినప్పుడు 6కి మించి వెంట్రుకలు రాలడాన్నిగమనించినట్లయితే పేషెంట్ యొక్క లక్షణాలని బట్టి అలోపెశియా సమస్య ఉన్నట్లు నిర్థారిస్తారు.
టగ్ టెస్ట్: ఈ పరీక్షద్వారా జుట్టు ఎంత ధృడంగా ఉందనే విషయాలగురించి తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా జుట్టు పెళుసుదనం అలాగే ఏదైనా ఇతర చర్మం వ్యాధులు కలిగి ఉన్నారా అనే విషయాలను వైద్యులు అధ్యయనం చేస్తారు.
కార్డ్ పరీక్ష: ఈ కార్డ్ పరీక్షని ఎక్కువగా వెంట్రుకల ఆరోగ్య స్తితిగతులను తెలుసుకోవడానికి చేస్తుంటారు వైద్యులు. ఇందులో భాగంగా చిన్న వెంట్రుకలు, బలహీనంగా ఉన్న వెంట్రుకలు, అలాగే దెబ్బతిన్న వెంట్రుకలు వంటివి గుర్తిస్తారు. దీనినిబట్టి జుట్టు నష్టం ఎంత వరకూ ఉందనే విషయాలు అంచనా వేస్తుంటారు. అలోపెశియా సమస్యతో వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ సందర్భాలలో ఈ కార్డ్ పరీక్షలను సూచిస్తుంటారు.
- అలోపీసీయా సమస్యకి ఆహరం ఎలా కారణం అవుతుంది.?
మన దయనందన జీవితంలో ఎక్కువ వ్యాధులు, జబ్బులు, రుగ్మతులు ఇలా ప్రతీది డైలీ మనం తీసుకునే ఆహరం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే వైద్యులు “ఆహారం పరమ ఔషధం” అని అన్నారు. ఎందుకంటే సమయపాలన పాటిస్తూ తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వలన దాదాపుగా వ్యాధుల భారిన పడకుండా తప్పించుకోవచ్చు.
విటమిన్లు లోపించిన ఆహారాలు తీసుకోవడం:
అయితే ఈ అలోపెశియా సమస్య ఎక్కువగా మనం తీసుకునే ఆహరంలో ఐరన్, మల్టీ విటమిన్ డిఫీషియన్సి, బీ కాంప్లేక్స్, జింక్, విటమిన్ డి, ఫోలేట్ వంటివి లోపించడం వలన కలుగుతుంది. ఇందులో విటమిన్ డి రోగ నిరోధక శక్తి ప్రక్రియ (Immune Function) తో పాటూ జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
గ్లుటేన్ అధికంగా కలిగిన ఆహారాలు తీసుకోవడం.
గ్లుటేన్ అధికంగా కలిగిన ఆహారాలని తీసుకోవడంవలన కూడా ఈ అలోపెశియా సమస్య భారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే పలు అధ్యయనాలలో హెయిర్ ఫోలికల్ పెప్టైడ్ పెరాక్సిరెడాక్సిన్ 5 (PRDX5 తో గ్లూటెన్ యాంటిజెన్‌ల సంబంధాలు కలిగి ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అలాగే హెయిర్ ఫోలికల్ ఇన్ఫ్లమేషన్‌ను గ్లూటెన్ ప్రభావం చేసి అలోపెశియా సమస్యని మరింత పెంచుతుందని తేలింది. వీటితోపాటూ అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, పాలిష్ చేసిన ధాన్యం గింజలు, జంక్ ఫుడ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్లు అలోపెశియా ప్రమాదాలను పెంచుతాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.
- అలోపీశియా కు జీవన శైలి ఎలా కారణం అవుతుంది.?
మన డైలీ లైఫ్ స్టైల్ ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను డాక్టర్లు ఇట్టే అంచనా వేస్తుంటారు. ఎందుకంటే అస్తవ్యస్తమైన జీవనశైలి అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి కారణం అవుతుంది. అలాగే సక్రమమైన జీవనశైలి సరళమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితానికి కారణం అవుతుంది.
- ధూమపానం అలవాటు కలిగి ఉండటం.
- మద్యపానం చేసే అలవాటు కలిగి ఉండటం.
- నిద్రలేమి సమస్యలతో భాధ పడుతుండటం లేదా సరిగ్గా నిద్రపోకపోవడం.
- అధికబరువు సమస్య కలిగి ఉండటం.
- అధిక క్రొవ్వులు కలిగిన ఆహారాలు తీసుకోవడం.
- గ్లుటేన్ అధికంగా కలిగిన ఆహారాలను క్కువ మోతాదులో తీసుకోవడం.
- అలోపేసియా చికిత్సలో ఆయుర్వేదం ఎందుకు మంచిది?
టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతున్నప్పటికీ కొన్ని వ్యాధులు మరియు జబ్బులకి ఇప్పటికీ సరైన చికిత్సా నివారణోపాయాలు లేవు. అందులో ఈ అలోపీశియా సమస్య ఒకటి. అయితే ఈ సమస్యకి హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి, ఇలాంటి పద్దతిలలో కార్టికోస్టెరాయిడ్స్ యొక్క ఇంజెక్షన్లు, ఆంత్రాలిన్, మినాక్సిడిల్, షేవింగ్, వంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం అరకొరగా ఉంటున్న సంఘటనలు కోకొల్లలు. దీనికితోడు ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ భారిన పడే అవకశాలు కూడా లేకపోలేదు. దీంతో ఇప్పటికీ చాలామంది ఈ అలోపీశియా సమస్యతో కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం, తలమీద మరియు ఇతర భాగాలలో వెంట్రుకలు రాలిపోయే సమస్యలకి సరైన చికిత్స విధానాలు లేక సతమతమవుతున్నారు. ఇటువంటి వారికి ఆయుర్వేదం ఆపన్న హస్తం అందిస్తోంది.
- ఆయుర్వేదంతో అలోపేసియాకి సులభంగా చెక్:
సనాతన ఆయుర్వేదం వైద్య విధానాలలో మాత్రం అలోపీశియా సమస్యని అతి సులువుగా తగ్గించుకునే మార్గాలు మరియు మందులు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆయుర్వేద వన మూలికలైన ఓషధ మొక్కలలో రారాజైన బృంగారాజ, మంజిష్ఠ, ఆమ్లకి, గుంటకలిజేరు, వెల్లుల్లి, నిమ్మరసం, కొబ్బరినూనె, బొప్పాయి పువ్వు రసం మరియు పాలు, వంటివాటితో తయారు చేసిన లేపనాలు, తైలాలు, వంటివి అలోపిశియా సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాలలో ఆయుర్వేద వైద్య విధానాలలో జుట్టు సంబందిత సమస్యలను అధిగమించడానికి ఉపయోగించే ప్రచ్చానం పద్ధతిని ఉపయోగిస్తుంటారు వైద్యులు. ఇందులో ముఖ్యంగా రసమనిక్య రస లేదా బల్లాతక ఔషధాలు వంటివి ఉపయోగించి చిన్నపాటి సూదితో శస్త్ర చికిత్స విధాన పద్దితిలో జుట్టు రాలిపోయిన చోట చొప్పించి ఊడిపోయిన జుట్టు ని మళ్ళీ తరిగి పొందేలా చేస్తారు.
ముఖ్య గమనిక : పైన తెలుపబడిన సమాచారం రీడర్ల అవగాహన కొరకు ఇంటర్నెట్ మరియు పలు పుస్తకాల ఆధారంగా సేకరించిన సమాచారంఆధారంగా పొందుపరచబడింది. కావున ఏదైనా అనుమానాస్పద లక్షణాలు లేదా సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించగలరు.