Best Ayurvedic Treatments by Doctor Krishna
Share
డాక్టర్ కృష్ణ హెల్త్ టాపిక్స్
1 ఎప్పుడైనా చర్మం కాలినప్పుడు , ఆప్పటి కి అప్పుడు ప్రధమ చికిత్స గా , బాగా పండిన అరటి పండును బాగా పిసికి , పేస్ట్ ల చేసి, కాలిన గాయాలపైన పూయాలి. వెంటనే మంట తగ్గడమే కాకుండా కాలిన గాయాలు, నీరు పట్టకుండా.. తొందరగా తగ్గి పోవడానికి బాగా పనిచేస్తుంది.
2 కామెర్లను వారం రోజుల్లో పోగొట్టే అద్భుతమైన ప్రయోగం ఇది. అడ్డసరం ఆకును తీసుకు వచ్చి , శుభ్రంగా కడిగి, బాగా దంచి, రసం తీసుకోవాలి. 20 ఎం ఎల్ రసంలో , రెండు చెంచాల మంచి స్వచ్ఛమైన తేనే కలిపి, రెండు పూటలు తాగాలి. ఇలా వారం రోజుల పాటు, మజ్జిగ, పాల అన్నం తింటూ , ఈ అడ్డసరం రసాన్ని తాగితే వారం లో కామెర్లు పూర్తిగా తగ్గుతాయి.
3 అవిసెలు ఆరోగ్యానికి చాలా మంచివి. అవిసెలను శుభ్రం చేసి, వాటి పైన కొద్దిగా నీళ్లు చల్లాలి. తరువాత వాటిని దోరగా వేయించాలీ. ఆలా వేయించిన అవిసెలను రోజు ఒక 20 గ్రాముల చొప్పున తింటూ ఉంటె.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల , గుండెకు మంచి బలాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
4 శీఘ్ర స్కలనాన్ని తగ్గించి, రతి శక్తి పెంచే మంచి ప్రయోగం ఇది. అతి బల గింజల పొడి, అశ్వగంధ, శతావరి పొడులను సమ భాగాలుగా తీసుకుని , దానికి సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి , రెండు పూటలు భోజనం తరువాత , అరగంట ఆగి, గ్లాస్ పాలల్లో ఒక్కో చెంచా కలిపి తీసుకోవాలి. సెక్సవల్ పవర్ పెరగడమే కాకుండా వీర్య వృద్ధి కూడా జరుగుతుంది.
5 అశోక చెట్టు. సన్నగా పొడవుగా పెరిగే చెట్టు అశోక చెట్టు కాదు. ఆయుర్వేదం లో ఉపయోగించే అసలైన అశోక చెట్టు , ఇంచు మించు మామిడి చెట్టు లాగే ఉంటుంది. ఈ చెట్టు బెరడు కాషాయం తో స్త్రీల మెన్స్ట్రుల్ సైకిల్ క్లీన్ అవుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా యోని, గర్భసంచి ఆరోగ్యం కోసం ఈ అశోక చెట్టు బెరడు కషాయాన్ని , కనీసం రెండు నెలల పాటైనా తాగితే మంచిది.
6 ఆముదం గింజలను 100 గ్రాములు తీసుకోవాలి. గింజలను కొద్దిగా నలగ కొట్టి, పైన ఉండే పొట్టు తీసెయ్యాలి. మిగిలిన ఆముదం గింజల పప్పును 100 గ్రాముల నువ్వుల నూనెలో వేసి మరగ పెట్టాలి. పప్పు మొత్తం మాడిన తరువాత , నూనె ను వడకట్టుకుని దాచి ఉంచుకోవాలి. ఆ నూనెను ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఐదు , ఆరు చుక్కలు అంగం పైన వేసుకుని , స్మూత్ గా కాసేపు మర్దన చేసి పడుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే.. కొద్దీ రోజుల్లోనే అంగం బాగా బల పడి , రతి శక్తి కలుగుతుంది.
7 ఒక్కోసారి, కొన్ని సందర్భాలలో టెస్టికల్స్ లో నీరు చేరి, వాపు వస్తుంది. నొప్పిగా ఉంటుంది. ఆలాంటి సమస్యలో ఆవనూనె బాగా పనిచేస్తుంది. ఆవనూనె ను రాత్రి పడుకునే ముందు టెస్టికల్స్ పైన సున్నితంగా మర్దన చేయాలి. అలాగే కూరలు వండుకోవడానికి కూడా ఆవనూనె ను తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటె.. వెరికోసిల్ తగ్గిపోతుంది.
8 వయసు పై పడిన వారిలో , మూత్రం కంట్రోల్ లో ఉండదు . తెలియకుండానే బట్టల్లో పడిపోతుంది. అలాంటి వారు , ప్రతి పూట భోజనం లో మొదటి ముద్దలో , రెండు చిటికెల ఆవాల పొడి కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఐతే సమస్య ఎక్కువగా , చాల రోజుల్లనుంచి ఉంటె.. హ్యాపీ ప్రో టాబ్లెట్స్ 3 నెలల పాటు వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్రోస్టేట్ సమస్యలు తగ్గి , అతి మూత్రం కూడా కంట్రోల్ అవుతుంది.
9 కొంత మంది చిన్న పిల్లల్లో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. అది కడుపు లో ఉండే నులి పురుగుల వల్ల కూడా రావచ్చు. అలాంటప్పుడు కొద్దిగా చిన్న ఆవాలను తీసుకుని , దోరగా వేయించి , పొడి చేసుకోవాలి. అర గ్రాము పొడిని, ఒక చిన్న కప్పు పెరుగులో కలిపి , రెండు పూటలు తినిపించాలి. ఇలా మూడు రోజు ల పాటు చేస్తే , పొట్టలోని క్రిములన్ని చనిపోయి, మలం ద్వారా బయటకి పోతాయి. దాంతో పిల్లలు పళ్ళు కొరకడం కూడా ఆపేస్తారు.
10 ఆకుపత్రి. బిర్యానీ ల్లో , నాన్ వెజ్ కర్రీ ల్లో మంచి మసాలా రుచి కోసం ఆకుపత్రి ని ఉపయోగిస్తారు. ఈ ఆకు తో ఇంకా చాలా రకాల ఉపయోగాలున్నాయి. నత్తి ఉన్నవాళ్లు చిన్న ఆకు ముక్కను నాలుక పై ఉంచుకుని , మెల్లిగా చప్పరిస్తూ ఉంటె నత్తి తగ్గుతుంది. బట్టలు ఉంచే కప్ బోర్డుల్లో ఈ ఆకులను ఉంచితే పురుగులు , బొద్దింకలు రావు. అంతే కాదు బట్టలు మంచి సువాసన వెదజల్లుతుంటాయి.