అలోపేసియా రకాలు: "వివిధ రకాల అలోపేసియాను అన్వేషించడం"
షేర్ చేయి
- పేను కొరుకుడు అంటే ఏంటి .?
మనిషిని తలతో పాటూ ఇతర శరీర శరీర భాగాలలో ఉన్నటువంటి జుట్టు రాలిపోవడాన్ని పేను కొరుకుడు సమస్య అని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీస్. ఈ పేను కొరుకుడు సమస్యని ఇంగ్లీష్ లో “అలోపీసీయా ఏరేటా” అని అంటారు. ఈ సమస్య ఎక్కువగా రోగనిరోధక వ్యవస్థ పొరపాటున హెయిర్ ఫోలికల్స్‌పై దాడి చేయడం వలన ఏర్పడుతుంది. మరికొందరిలో జన్యుపరమైన అలాగే పర్యావరణ సంబంధిత కారణాలవలన కూడా కలుగుతుంది. అయితే పేను కొరుకుడు సమస్య వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయసు వారికి వస్తుంటుంది. కానీ ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో ఎక్కువగా ఈ పేను కొరుకుడు సమస్య అనేది 20-30 వయసు మధ్య వారిలో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ ఆర్టికల్ లో ఈ పేను కొరుకుడు సమస్య గురించి పూర్తిగా తెలుసుకుందాం.

- అలోపీసీయ కారణాలు.
- సాధారణంగా ఈ పేను కొరుకుడు సమస్య ఆటో ఇమ్యూన్ డిసీస్ అయిన థైరాయిడ్, సోరియాసిస్ వ్యాధి , రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా బొల్లి మచ్చలు , మంగు మచ్చలు వంటివి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది.
- పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- అధిక రోగ నిరోధక శక్తికి సంబందించిన మెడిసిన్ వాడటం
- కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు పొందడం.
- ఇన్ఫ్లమేషన్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నాయి.
- చర్మ రుగ్మతలు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నాయి.
- ఇంతకుముందే తమ కుటుంబంలో ఎవరైనా ఈ అలోపీసీయా సమస్య కలిగి ఉంటారు.
- జన్యుపరమైన వ్యాధులతో బాధ పడుతుండటం.

- అలోపీసీయ లక్షణాలు:
- తరచుగా జుట్టు రాలిపోతుంది. ఇందులో ముఖ్యంగా జుత్తు నానెం లేదా ఆకారం లేని రూపంలో కొంత భాగంలో మాత్రమే జుట్టు రాలిపోవడం.
- కనుబొమ్మలు, శరీరంలోని ఇతర భాగాలలోని వెంట్రుకలు రాలిపోవడం.
- చేతి గోర్ల రంగులో మార్పులు కనిపించడం. మరియు పెళుసుగా, కరుకుగా మారడం
- తల మరియు వెంట్రుకలు కలిగిన భాగాలలో దురదలు, మంటగా ఉండటం.
- అనుకోకుండా జుత్తు రంగు బూడిద రంగులోకి మారడం మరియు ఊడిపోవడం.

- అలోపీసీయా ఎన్ని రకాలుగా వస్తుంది. ?
ఈ అలోపేసియా సమస్య తీవ్రతని బట్టి 4 లేదా అంతకంటే ఎక్కువ రకాలుగా విభజించారు. ఇందులో ముఖ్యంగా
- అలోపేసియా బార్బే: ఈ రకం అలోపేసియా సమస్య కలిగిన వారిలో గడ్డం మీద జుట్టు రాలిపోతుంది. కానీ ఒక్కోసారి ఇతర భాగాలలో ఉన్నటువంటి వెంట్రుకలపై ఈ ప్రభావం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
- అలోపేసియా ఒఫియాసిస్: ఈ రకమైన అలోపేసియా సమస్య ఉన్నవారిలో వారి నెత్తిమీద జుట్టు కొన్ని చోట్ల తరచుగా రాలిపోతుంటుంది. కానీ పూర్తీ స్థాయిలో మాత్రం వెంట్రుకలు రాలిపోవు. అలాగే ఈ ప్రభావం ఇతర భాగాలలో ఉన్నటువంటి వెంట్రుకలపై ప్రభావం చూపదు.
- అలోపేసియా టోటాలిస్: ఈ రకమైన అలోపేసియా సమస్య ఉన్నవారిలో వారి తలపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా కోల్పోతారు. అలాగే ఈ ప్రభావం స్కాల్ప్ పై పడి జుత్తు మళ్ళీ తిరిగి పొందలేని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
- అలోపేసియా యూనివర్సాలిస్: ఈ అలోపేసియా యూనివర్సాలిస్ అనేది చాలా అరుదైన పేను కొరుకుడు సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలలో వెంట్రుకలు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా తలమీద చర్మం, ముఖం (కనుబొమ్మలు) మరియు శరీరంలోని మిగిలిన భాగాలపై దాదాపుగా లేదా పూర్తిగా జుట్టు రాలడం జరుగుతుంది.
- పాచీ అలోపేసియా అరేటా: పేను కొరుకుడు సమస్య ఉన్నవారిలో ఈ పాచీ అలోపేసియా అరేటా రకం సమస్య సాధారణంగా కనిపిస్తుంది. ఈ రకమైన సమస్య ఉన్నవారిలో నెత్తిమీద లేదా శరీరంలోని ఇతర భాగాలలో జుట్టు రాలి పోతుంది. ఇందులో ముఖ్యంగా తలమీద ఉన్నటువంటి వెంట్రుకలు ఒక చోట లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నాణెం-పరిమాణంలో జుట్టు రాలిపోతుంటుంది. ఒక్కోసారి ఆకారం లేని గుర్తులలో కూడా జుట్టు రాలిపోతుంటుంది.

- అలోపేసియా ని గుర్తించడం ఎలా..?
- జుట్టు రాలిన ప్రాంతాలను మరియు గోళ్లను పరిశీలించడం. ఒకవేళ గోళ్ళు రంగు మారడం లేదా పెళుసుగా మారడం గమనించినట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- హ్యాండ్‌హెల్డ్ మాగ్నిఫైయింగ్ పరికరాన్ని ఉపయోగించి జుట్టు మరియు హెయిర్ ఫోలికల్ స్థితిగతులను పరిశీలించడం.
- అలోపీషియా సమస్య కలిగిన వ్యక్తి యొక్క మెడికల్ హిస్టరీ మరియు కుటుంబ సభ్యుల మెడికల్ హిస్టరీని పరిశీలించడం.
స్కాల్ప్ బయాప్సీ: ఒక్కోసారి జుట్టు రాలడానికి నిర్దిష్టమైన కారణంతేలియకపోతే డాక్టర్లు ఈ స్కాల్ప్ బయాప్సీ స్టాళ్లను సూచిస్తారు. ఇందులో భాగంగా వైద్యులు తల మరియు చర్మ భాగాలలోని కొంత కణజాలం తీసి పరీక్షలకు చేస్తారు.
రక్త నమూనా పరీక్షలు : ఈ ప్రక్రియ ద్వారా అలోపీషియా సమస్య కలిగిన వ్యక్తి బ్లడ్ సాంపిల్స్ ని తీసుకుని నమూనా పరీక్షలకు పంపిస్తారు. అయితే ఈ రక్తనమూనా పరీక్షలు అలోపేశియా సమస్య ఉందా లేదా అనే విషయాలు తెలుపలేదు. కానీ ఇతర వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు పరోక్షంగా ఈ అలోపేషియా కారణం అవుతున్నాయా అనే సమస్య ఉంది.
లైట్ మైక్రోస్కోపీ: ఈ ప్రక్రియలో వైద్యులు స్కాల్ప్ నుండి కత్తిరించిన జుట్టు నమూనా పరీక్షలకి పంపించారు .
పుల్ టెస్ట్: ఈ పరీక్ష ద్వారా మీ స్కాల్ప్ యొక్క వివిధ భాగాలలోని జుట్టు రాలడాన్ని తనిఖీ చేస్తుంది. కాగా డాక్టర్లు ఈ పరీక్ష ద్వారా కొన్ని వెంట్రుకలను నిర్దిష్ట బలాన్ని ఉపయోగించి లాగుతూ పరీక్షిస్తారు. ఈ ఉంటే 40 లేదా అంతకంటే ఎక్కువ వెంట్రుకలను లాగినప్పుడు 6కి మించి వెంట్రుకలు రాలడాన్నిగమనించినప్పుడు పేషెంట్ యొక్క లక్షణాల ఆధారంగా పేర్కొన్న నిర్థారిస్తారు.
టగ్ టెస్ట్: ఈ పరీక్షద్వారా జుట్టు ఎంత ధృడంగా ఉందనే విషయాలగురించి తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా జుట్టు పెళుసుదనం అలాగే ఏదైనా ఇతర చర్మ వ్యాధులు ఉన్నాయా అని వైద్యులు అధ్యయనం చేస్తారు.
కార్డ్ పరీక్ష: ఈ కార్డ్ పరీక్షని వెంట్రుకల ఆరోగ్య స్థితిగతులను ఎక్కువగా నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇందులో భాగంగా చిన్న వెంట్రుకలు, బలహీనంగా ఉన్న వెంట్రుకలు, అలాగే దెబ్బతిన్న వెంట్రుకలు నిలువుగా గుర్తిస్తారు. దీనినిబట్టి జుట్టు నష్టం ఎంత వరకూ ఉందనే విషయాలు అంచనా వేస్తారు. అలోపేషియా సమస్యతో వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ సార్లు ఈ కార్డ్ పరీక్షలను సూచిస్తారు.

- అలోపీసీయా సమస్యకి ఆహరం ఎలా ఉంటుంది. ?
మన దయనందన జీవితంలో ఎక్కువ వ్యాధులు, జబ్బులు, రుగ్మతలు ఇలా ప్రతీది డైలీ మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే వైద్యులు “ ఆహారం పరమ ఔషధం ” అని అన్నారు. ఎందుకంటే సమయపాలన పాటిస్తూ తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వలన దాదాపుగా వ్యాధులు భారిన పడకుండా తప్పించుకోవచ్చు.
విటమిన్లు లోపించిన ఆహారాలు తీసుకోవడం:
అయితే ఈ అలోపేషియా సమస్య మనం ఎక్కువగా తీసుకునే ఆహారంలో ఐరన్, మల్టీ విటమిన్ డిఫీషియన్సీ, బీ కాంప్లెక్స్, జింక్, విటమిన్ డి, ఫోలేట్ కాలనీ లోపించడం వలన కలుగుతుంది. ఇందులో విటమిన్ డి రోగ నిరోధక శక్తి ప్రక్రియ (ఇమ్యూన్ ఫంక్షన్ ) తో పాటూ జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
గ్లుటేన్ అధికంగా కలిగిన ఆహారాలు తీసుకోవడం.
గ్లుటేన్ అధికంగా కలిగిన ఆహారాలను తీసుకోవడం వలన కూడా ఈ అలోపేషియా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే పలు అధ్యయనాలలో హెయిర్ ఫోలికల్ పెప్టైడ్ పెరాక్సిరెడాక్సిన్ 5 (PRDX 5 తో గ్లూటెన్ యాంటిజెన్‌ల సంబంధాలు ఉన్నాయి వైద్యులు పేర్కొన్నారు. అలాగే హెయిర్ ఫోలికల్ ఇన్ఫ్లమేషన్‌ను గ్లూటెన్ ప్రభావం చేసి అలోపేషియా సమస్య మరింత పెరుగుతుందని తేలింది. వీటితోపాటూ అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, పాలిష్ చేసిన ధాన్యం గింజలు, జంక్ ఫుడ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్లు అలోపేషియా ప్రమాదాలు పెంచుతాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

- అలోపీషియాకు జీవన శైలి ఎలా ఉంటుంది. ?
మన డైలీ లైఫ్ స్టైల్ ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే డాక్టర్లు ఇట్టే అంచనా వేస్తారు. ఎందుకంటే అస్తవ్యస్తమైన జీవనశైలి అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి కారణం అవుతుంది. అలాగే సక్రమమైన జీవనశైలి సరళమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితానికి కారణం అవుతుంది.
- ధూమపానం అలవాటు కలిగి ఉండటం.
- మద్యపానం చేసే అలవాటు ఉండటం వల్ల.
- నిద్రలేమి సమస్యలతో భాధ పడుతుండటం లేదా సరిగ్గా నిద్రపోకపోవడం.
- అధికబరువు సమస్య కలిగి ఉండటం.
- అధిక క్రొవ్వులు కలిగిన ఆహారాలు తీసుకోవడం.
- గ్లుటేన్ అధికంగా కలిగిన ఆహారాలను క్కువ మోతాదులో తీసుకోవడం.

- అలోపేసియా చికిత్సలో ఆయుర్వేదం ఎందుకు మంచిది ?
టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ కొన్ని వ్యాధులు మరియు జబ్బులకు సరైన చికిత్సా నివారణోపాయాలు లేవు. అందులో ఈ అలోపీషియా సమస్య ఒకటి. అయితే ఈ సమస్యకి హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి, ఇలాంటి పద్దతిలలో కార్టికోస్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు, ఆంత్రాలిన్, మినాక్సిడిల్, షేవింగ్, వంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్న సంఘటన ఫలితాలు మాత్రం అరకొరగా ఉంటున్నాయి కోకొల్లలు. దీనికితోడు ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ భారిన పడే అవకాశలు కూడా లేకపోలేదు. ఇప్పటికీ చాలామంది ఈ అలోపీషియా సమస్యతో కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం, తలమీద మరియు ఇతర భాగాలలో వెంట్రుకలు రాలిపోయే సమస్యలకు సరైన చికిత్స విధానాలు లేక సతమతమవుతున్నారు. అలాంటి వారికి ఆయుర్వేదం ఆపన్న హస్తం అందిస్తోంది.

- ఆయుర్వేదంతో అలోపేసియాకి సులభంగా చెక్:
సనాతన ఆయుర్వేదం వైద్య విధానాలలో మాత్రం అలోపేషియా సమస్యని అతి సులువుగా తగ్గించుకునే మార్గాలు మరియు మందులు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆయుర్వేద వన మూలికలైన ఓషధ మొక్కలలో రారాజైన బృంగారాజ, మంజిష్ఠ, ఆమ్లకి, గుంటకలిజేరు, వెల్లుల్లి, నిమ్మరసం, కొబ్బరినూనె, బొప్పాయి పువ్వు రసం మరియు పాలు , వంటివాటితో తయారు చేసిన లేపనాలు, తైలాలు, అలోపిషియా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఆయుర్వేద వైద్య విధానాలలో జుట్టు సంబందించిన సమస్యలను అధిగమించడానికి ఉపయోగించే ప్రసంగం పద్ధతిని ఉపయోగిస్తుంటారు వైద్యులు. ఇందులో ముఖ్యంగా రసమానిక్య రస లేదా బల్లాతక మందులను ఉపయోగించి చిన్నపాటి సూదితో శాస్త్ర చికిత్స విధాన పద్దితిలో జుట్టు రాలిపోయిన చోట చొప్పించి ఊడిపోయిన జుట్టు ని మళ్ళీ తరిగి పొందేలా చేస్తారు.
ముఖ్య గమనిక : పైన పేర్కొనబడిన సమాచారం రీడర్ల అవగాహన కొరకు ఇంటర్నెట్ మరియు పలు పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారంఆధారంగా పొందబడింది. కావున ఏదైనా అనుమానాస్పద లక్షణాలు లేదా సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించగలరు.